Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న నూతన చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా నటిస్తున్న ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అగ్ర దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురళి కిషోర్ పనిచేశారు.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో మొదలైంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో 80 శాతం షూటింగ్‌ని పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగానే పాటలు, ఫైట్ సీక్వెన్స్‌లను కూడా చిత్రీకరించనున్నారు.
'పిల్లా నువ్వు లేని జీవితం', 'భలే భలే మగాడివోరు', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'చావు కబురు చల్లగా', 'ప్రతిరోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' లాంటి అద్భుతమైన విజయాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఓ వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత బన్నీవాసు తెలిపారు. ''వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరు స్తున్నారు. వైవిధ్యమైన కథలు, భిన్న
పాత్రలతో ఇప్పటికే మా కథానాయకుడు కిరణ్ అబ్బవరం తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆయన శైలిలోనే చాలా భిన్నంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా మా దర్శకుడు మురళి ఈ చిత్రకథను అద్భుతంగా రాసుకున్నారు. ఈ సినిమాతో మరోమారు తమ జీఏ2 పిక్చర్స్‌లో హిట్ అందుకోబోతున్నామని మేకర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. కథానుగుణంగా తిరుపతి, దాని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి' అని చిత్ర బృందం పేర్కొంది.
ఈ చిత్రానికి సహనిర్మాత : బాబు, సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సత్య గమిడి, శరత్ చంద్రనాయుడు, ఆర్ డైరెక్టర్ : రామ్ కుమార్, దర్శకత్వం : మురళి కిషోర్.