Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ యాంకర్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం 'జయమ్మ పంచాయితీ'. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఓ వీడియో రూపంలో షేర్ చేసుకుంది.
విజరు కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పల్లెటూరి డ్రామా నేపథ్యంలో ఈ చిత్ర టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింది. ఎం.ఎం కీరవాణి సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందించారు.
'ఇటీవల స్టార్ హీరో రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, యువ కథానాయకులు నాని ఫస్ట్ సింగిల్, రానా దగ్గుబాటి టీజర్‌ను విడుదల చేశారు. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఇవన్ని ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టు కున్నాయి. జయమ్మగా సుమ ఏ విధంగా పంచాయితీ చేయనుందనే విషయాన్ని మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది' అని చిత్ర బృందం తెలిపింది.
సుమ కనకాల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అనూష్ కుమార్, ఎడిటర్: రవితేజ గిరిజాల, సమర్పణ : శ్రీమతి. విజయ లక్ష్మి, కళ: ధను అంధ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్ - అఖిల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజరు కుమార్ కలివరపు.