Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఆసక్తికరమైన ప్రచారంతో మేకర్స్ ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలను భారీగా పెంచారు. ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ విడుదల తేదీతో పాటు మేకింగ్ గ్లింప్స్‌ని కూడా విడుదల చేసి, మరోసారి వినూత్న పబ్లిసిటీతో ఆకట్టు కున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మరింత ఆసక్తి పెంచింది. శత్రువులను మట్టుబెట్టడానికి పొడవాటి కత్తితో ఫెరోషియస్‌గా ఉన్న కమల్‌హాసన్ పోస్టర్ని చూస్తుంటే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్లో థియేటర్ల ద్వారా విడుదల చేయ బోతున్నట్టు ఈ పోస్టర్లో పేర్కొన్నారు. ఈ పోస్టర్ని సోషల్ మీడిమా వేదికగా కమల్‌హాసన్ తన అభిమానులతో, 'నేను కూడా ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా..' అంటూ పేర్కొన్నారు. ఇక గ్లింప్స్‌లో సైతం కమల్ హాసన్, విజరు సేతుపతి, ఫహద్ ఫాజిల్ త్రయాన్ని శక్తివంతమైన పాత్రలలో దర్శకుడు ఆవిష్కరించారు. వీరి పాత్రలను మరింత ఎలివేట్ చేస్తూ అనిరుధ్ రవిచందర్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థ్రిల్ ఫీల్‌ని ఇచ్చారు.
విజరు సేతుపతి ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ ఓ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. కమల్ హాసన్ నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాళిదాస్ జయరామ్, నరైన్, శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: లోకేష్ కనగరాజ్, నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్.