Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఫ్యాన్స్‌ని దష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను బ్యాలెన్డ్‌గా చూపించ లేదు. ఇద్దరికీ నిడివి ఎంత ఉంది?, ఆ హీరోకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి?, ఈ హీరోకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి?, ఎవరు ఎన్ని పంచ్ డైలాగ్స్ చెప్పారు. ఇలాంటి లెక్కల్ని పక్కన పెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' సినిమా తీశా' అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చెప్పారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డి.వి.వి. ఈచిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మంగళవారం 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఆద్యంతం భావోద్వేగభరితం : రాజమౌళి
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ.. అందరూ నన్నొక ప్రశ్న అడుగుతున్నారు. స్క్రీన్‌పై రామ్‌చరణ్, ఎన్టీఆర్‌కి ఈక్వల్ స్పేస్ ఇచ్చారా అని.. వాళ్ళందరికీ నా సమాధానం ఒక్కటే. ఈ సినిమాకి అలాంటి లెక్కలతో ఉన్న ఆలోచనలు చేయలేదు. నేను ఆలోచించింది ఒక్కటే.. ప్రేక్షకుల్లో ఇద్దరిపై ఒకే విధమైన ఫీలింగ్ రావాలి. ఇద్దరి గురించి ఒకేలా ఆలోచించాలి. సినిమా మొదలై, ఇద్దరి ఇంట్రడక్షన్స్ పూర్తి అయిన తర్వాత రెండు పాత్రలు క్లోజ్ అవుతాయి. స్టార్ హీరోలుగా వాళ్లు అభిమానులకు, ప్రేక్షకులకు బాగ్లా క్లోజ్. లెక్కలు వేసుకుని తీస్తే, ఆత్మ లేని సినిమా వస్తుంది. తెరపై పాత్ర నవ్వితే ప్రేక్షకులు.. నవ్వాలి.. ఏడిస్తే ప్రేక్షకులూ ఏడవాలి. అప్పుడే మంచి సినిమా వస్తుందని నమ్ముతా. ఇది బయోపిక్ కాదు. ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఉన్న చిత్రం మాత్రమే. కథానుగుణంగా ఇందులోని పాత్రల స్వభావం మేరకు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ని, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ని, సీతగా అలియాభట్‌ని ఎంపిక చేసుకున్నాను. నా పాత్రలకు వీళ్ళనే ఎంచుకోవడానికి కారణం వ్యక్తిత్వం, ప్రతిభ కూడా. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులందరూ భావోద్వేగానికి గురవుతారు. అంతలా అందర్నీ లీనం చేసే సినిమా ఇది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడినప్పటికీ, 3డీ వర్క్ పరంగా మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. నా ఆలోచనల్ని 3డీ రూపంలో ఎఫెక్టీవ్‌గా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఇన్నేండ్ల కెరీర్లో నా సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది, అన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎప్పుడూ చెప్పలేదు. 'బాహుబలి', 'బాహుబలి 2' కంటే అద్భుతంగా ఈసినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను.
ఆ స్థాయిని దాటేసి ముందుకెళ్ళాం : ఎన్టీఆర్
ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మారింది. గతంలో చాలా లెక్కలుండేవి. ఆ లెక్కలకు పుల్‌స్టాప్ పెట్టి అభిమానులు సైతం ఇద్దరు హీరోలను ఒకేలా చూడటానికి ప్రిపేర్ అయ్యారు. ఈ విషయంలో గతంలో ఉన్న స్థాయిని దాటేసి మనం ముందుకెళ్ళామని భావిస్తున్నా. రామ్‌చరణ్, నేను స్నేహితులం. మా స్నేహం ఈ సినిమాలోని పాత్రలకు ఎంతగా ఉపయోగపడిందో తెలియదుగానీ, మా స్నేహం మరింత బలోపేతం కావడానికి ఆ పాత్రలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు మాకు ప్రతీ రోజూ ఓ అందమైన జ్ఞాపకాన్ని అందించింది. షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నా. రాజమౌళిగారు ఈ కథ నాకు చెప్పినప్పుడే బాగా ఎగ్జైట్ అయ్యాను. ఇకపై మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తాయి. మంచి కథ, దర్శకుడు బాగా తీయగలడనే నమ్మకం ఉంటే మహేష్‌బాబు, బన్నీ, ప్రభాస్, చిరంజీవి, నాగార్జున బాలయ్య బాబారు.. ఇలా అందరితో కలిసి నటిస్తా.
ఉక్రెయిన్ పరిస్థితి బాధాకరం
ఈ సినిమాలో 'నాటు నాటు...' సాంగ్‌ను ఉక్రెయిన్‌లో చిత్రీకరించాం. ఈ పాట బ్యాగ్రౌండ్లో ఉన్న డాన్సర్స్ అంతా ఉక్రెయిన్‌కు చెందినవారే. అక్కడి వాళ్ళంతా చాలా సౌమ్యంగా, మంచి మనుసుతో ఉన్నారు. ఎదుటి వాళ్ళకి సాయం చేసే తత్వంతోపాటు ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్న ధోరణి వాళ్ళలో బాగా కనిపించింది. అయితే ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా రష్యాకు వ్యతిరేకంగా, మాతభూమికి అండగా నిలబడుతున్నారు. పాట షూటింగ్ టైమ్‌లో నాకు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తితో ఫోన్లో మాట్లాడితే, 'తన 85 ఏండ్ల తండ్రితో సహా అందరూ తుపాకులతో శత్రువులను ఎదుర్కొంటున్నామని చెప్పారు'. ఇది విని ఎంతో బాధపడ్డాను. వాళ్ళకి ఆర్థిక సాయం చేసేందుకు వాళ్ళ ఎకౌంట్లో కొంత డబ్బు వేశాను. అలాగే ఉక్రెయిన్‌లో నాకు తెలిసిన వాళ్ళందరి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. పలు కారణాలతో ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడినప్పటికీ ప్రేక్షకులు, మా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, రాజమౌళి మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అందరికీ డబుల్ బొనాంజాలాంటి సినిమా అవుతుంది. రాజమౌళిగారు కథ, పాత్రలను రాసుకునే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన అనుకున్న దాంట్లో యాభై శాతం చేసినా సరే నటులుగా మేం సక్సెస్ సాధించినట్టే. ఇందులో అలియాభట్‌తో నటించడం చాలా బాగుంది. ఆమె చాలా సిన్సియర్, హార్డ్‌వర్కర్ కూడా. ఇకపై కూడా మల్టీస్టారర్ నేపథ్యంలో సినిమాలొస్తే నటించడానికి రెడీ ఉన్నా. అయితే ఈ తరహా కథలతో సినిమాలు చేసే దర్శకులు ఉన్నారని నేను అనుకోవడం లేదు. మన స్థాయిని పెంచే సినిమా ఇది.
- రామ్‌చరణ్