Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న నయా సినిమా 'హైవే'. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంగళవారం హీరో ఆనంద్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. హిల్ స్టేషన్లో టూర్‌ని ఎంజారు చేస్తున్నట్లు ఉన్న హీరో ఆనంద్ దేవరకొండ పోస్టర్ అందర్నీ అలరిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మా హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఆయన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తుంది' అని దర్శక, నిర్మాతలు అన్నారు.
అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజరు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, నిర్మాత: వెంకట్ తలారి, కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కె.వి.గుహన్.