Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్
పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ఈనెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, 'ఇందులో అలరించే కామెడీతోపాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. వర్ష పాత్ర చాలా క్యూట్‌గా ఉంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయా లుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ, స్టాండప్ కామెడీ ఎలా చేశాననేది ఇందులో దర్శకుడు బాగా డీల్ చేశారు' అని తెలిపారు. 'ఈ సినిమాను చూసి ప్రేక్షకులు థియేటర్ నుంచి చిరునవ్వుతో బయటకు వస్తారనే నమ్మకం ఉంది' అని నాయిక వర్ష బొల్లమ్మ చెప్పారు. దర్శకుడు శాంటో మాట్లాడుతూ, 'నా జీవితంలో జరిగిన సంఘటలతో ఈ కథ రాశా. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి' అని అన్నారు.
'ఇదొక డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈనెల 18న అందరూ సినిమా చూసి ఆనందించండి' అని నిర్మాతలు భరత్ మాగులూరి, నంద కుమార్ అబ్బినేని చెప్పారు.