Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి కేరాఫ్ అడ్రస్‌గా మా వింగ్స్ మోడల్ హబ్ మారింది. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహించిన 'మిస్టర్ అండ్ మిస్ ఇండియా' కార్యక్రమాన్ని ఈసారి పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం' అని మనోజ్ వీరగోని చెప్పారు. అన్ని రాష్ట్రాల వారితో కాంపిటీషన్ నిర్వహించి, ఫైనల్‌గా హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించబోతున్నారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మంగళవారం హైపర్ ఆది, హీరోయిన్ చాందిని పోస్టర్ లాంచ్ చేశారు.
మనోజ్ వీరగోని మాట్లాడుతూ, 'ఈ కార్యక్రమం గురించి చెప్పగానే బాలీవుడ్ స్టార్ అర్బాజ్ ఖాన్ బాగుందని సపోర్ట్ అందిస్తున్నారు. ఈ వేడుకలో ఆయన కూడా పాల్గొంటారు. ఆయనే మాకు మెంటర్, మే 29న హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. చాలా గ్రాండ్‌గా దీన్ని చేయబోతున్నాం. మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం' అని తెలిపారు. కతిక, జాహ్నవి, హైపర్ ఆది, సురేష్ కొండేటి, కిర్రాక్ ఆర్పీ, మహేష్ తదితరులు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.