Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్లో నటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు షూటింగ్‌కి విచ్చేసిన సల్మాన్‌ఖాన్‌కు పుష్పగుచ్చమిచ్చి చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు.
దీనిపై స్పందిస్తూ, 'గాడ్‌ఫాదర్.. భారు సల్మాన్ ఖాన్‌కి స్వాగతం! మీ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని తదుపరి స్థాయికి వెళ్లింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు అద్భుత కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు' అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్‌ఖాన్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే నయనతార కీలక పాత్రలో మెరవనుంది. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా, సంగీతం: ఎస్.ఎస్.తమన్, డీఓపీ : నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వాకాడ అప్పారావు.