Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఫి˜ల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ అధ్యక్షుడిగా నన్ను తొలగించి నట్లు వైజాగ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త వచ్చింది. అది పూర్తిగా అసత్యం. ఇప్పటికీ నేనే అధ్యక్షుడిగా ఉన్నాను' అని నిర్మాత కె.ఎస్.రామారావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'వైజాగ్‌లోని ఎఫ్ఎన్సిసిలో రూ.30 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని అనడం కూడా అవాస్తవం. ఎవరో సరైన అవగాహన లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసుంటారని భావిస్తున్నాను. ఆంధ్రాలో ఇండిస్టీ అభివద్ధి చెందాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి వార్తలు రావడం అందరినీ కన్ఫ్యూజ్ చేయడమే. అంతేకాదు ప్రభుత్వపరంగా చులకన భావం ఏర్పడుతుంది. ప్రస్తుత జగన్ ప్రభుత్వం కూడా ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివద్ధి చెందాలని బలంగా కోరుకుంటోంది. దీనికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. వాస్తవాలను తెలుసుకోవాలని అందర్నీ కోరుతున్నాను' అని అన్నారు.