Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. సిద్దు ముద్ద సమర్పకులు. హోలీ కానుకగా నేడు (శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వరుణ్‌తేజ్, దర్శకుడు అనిల్రావిపూడితో కలిసి బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు.
'దర్శకుడిలో చాలా క్లారిటీ ఉంది. ట్రైలర్లో అన్ని చక్కగా చెప్పాడు. రాజ్ తరుణ్ మంచి నటుడు. తన కష్టానికి ఫలితం దక్కుతుంది. కెమెరా విజువల్స్, సంగీతం బాగా ఆకట్టుకున్నాయి' అని హీరో వరుణ్‌తేజ్ అన్నారు. 'నాకు ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా ఇది. ఇందులో నేను బాగా నటించానంటే కారణం వర్ష. దర్శకుడు శాంటోతో పనిచేయడం హ్యాపీగా ఉంది. సినిమా మాకు నచ్చింది. మీకూ నచ్చుతుంది. ఫ్యామిలీడ్రామాతో కూడిన రోమ్కామ్ సినిమా ఇది' అని రాజ్ తరుణ్ తెలిపారు.
ఇంద్రజ మాట్లాడుతూ, 'యువతకు కనెక్ట్ అయ్యే విషయాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. యూత్ కూడా ఇప్పుడు సరైన మార్గంలో వెళ్తున్నారు. సహజీనం అనే అంశాన్ని చాలా డిటైల్డ్‌గా ఇందులో చెప్పారు' అని అన్నారు.
'మనం దేన్నైనా సరే ఇష్టపడితే ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం నిలబడాలి, పోరాటం చేయాలని చెప్పే కథే ఈ సినిమా. అందుకే స్టాండప్ కామెడీ నేపథ్యాన్ని ఎంచుకున్నా' అని దర్శకుడు శాంటో చెప్పారు.