Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'. 'కలర్ ఫొటో' దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమాలోని 'క్లాస్ రూమ్‌లో...' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను సంగీత దర్శకుడు తమన్ విడుదల
చేసి, పాట చాలా బాగుందని చిత్ర బందాన్ని అభినందించారు. 'నువ్వెక్క డుంటే నేనక్కడుంటా.. మాథ్స్లోనూ నీ ఊసులేగా, సైన్స్‌లో నీ ఊహ లేగా..' ఇలా స్టూడెంట్ జీవితపు ప్రేమ కథను గీత రచయిత రామ జోగయ్యశాస్త్రి అందంగా చెప్పారు. కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ పాటను విశాల్‌తో కలిసి సింధూరి పాడారు. దర్శకుడు సందీప్ రాజ్ 'కలర్ ఫొటో' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అందులో ఉన్న 'తరగతి గది దాటి..' పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాలోనూ క్లాస్ రూమ్‌లో పాట ఆ ఫీల్‌తోనే సాగుతూ అందర్ని ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ తెలిపింది.