Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అంటే సుందరానికి'. షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 10న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇందులో నానికి జోడిగా నజ్రియా ఫహద్ నటిస్తోంది. లీలా థామస్‌గా నజ్రియాను పరిచయం చేస్తూ మేకర్స్ ఆమెకు చెందిన జీరోత్ లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. దీర్ఘాలోచనలతో తన కలల సముద్రంలో ప్రయాణించే ఫోటోగ్రాఫర్‌గా చేతిలో కెమెరా పట్టుకుని ట్రెండీ దుస్తుల్లో నజ్రియా అందంగా ఉంది.
'వైవిధ్యమైన టైటిల్‌తో, భిన్న నాయకానాయికల పాత్రలతో మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. గతంలో నాని చేసిన క్యారెక్టర్స్‌తో పోలిస్తే ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర చాలా వినూత్నంగా ఉంటూ, ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మలయళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మలయాళంలో ఆమె నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాద చిత్రాలుగా విడుదలై, మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన నజ్రియా ఈ చిత్రంతో మన వాళ్ళకు మరింత దగ్గరవ్వడం ఖాయం. ఓ అద్భుతమైన కథను వివేక్ ఆత్రేయ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓ మంచి కంటెంట్ ఉన్న కథతో నిర్మించిన మా చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం' అని మేకర్స్ తెలిపారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకష్ణ తదితరులు ఇందులో ముఖ్య పాత్రధారులు.