Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది. అలాగే సినిమా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రీతిలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ని చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న ఈ సినిమాలోని 'పెన్నీ...'అంటూ సాగే సెకండ్ సింగిల్‌ని రిలీజ్ చేయబోతున్నారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో మహేష్‌బాబు స్టయిలీష్ లుక్ అందర్నీ అలరిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం తమన్ అద్భుతమైన సౌండ్ ట్రాక్‌లను అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'కళావతి...' వ్యూస్ పరంగా కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది. మంత్రముగ్ధులను చేసిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటికే 90 మిలియన్ల వ్యూస్‌ని దాటింది. అతి త్వరలోనే 100 మిలియన్ల మార్క్‌ను దాటడానికి సిద్ధంగా ఉంది. మొదటి పాట ఇంత పెద్ద హిట్ కావడంతో, మరో 3 రోజుల్లో వచ్చే సెకండ్ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు' అని చెప్పారు.
వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల, సంగీత దర్శకుడు: తమన్ ఎస్ఎస్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్.