Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా 'గని'. అల్లు బాబీ కంపెనీ, రియనెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శక, నిర్మాతలు విడుదల చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సిద్ధ ముద్ద మాట్లాడుతూ,' వరుణ్ తేజ్ నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నన్ను, దర్శకుడు కిరణ్, బాబి.. ముగ్గురిని బాగా సపోర్ట్ చేశారు. కోవిడ్ టైమ్స్‌లో కూడా ధైర్యం ఇచ్చారు. ఇక అల్లు అరవింద్ గారు మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.
'బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. మా ఐడియాలను స్క్రీన్ మీద తీసుకురావడానికి ఫైట్ మాస్టర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులకు కూడా మా కష్టం కనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది' అని దర్శకుడు కిరణ్ కొర్రపాటి అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'బాక్సింగ్ అనేది చాలా కాంప్లికేషన్‌తో కూడుకున్న ఎమోషనల్ కథ. బాక్సింగ్ ఉన్నా కూడా ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా' అని చెప్పారు.
'సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా కోసం ఏదైనా చేస్తాను. కరోనా సమయంలో కూడా కష్టపడి ఈ సినిమా చేశాం. కచ్చితంగా ఇది మిమ్మల్ని అలరిస్తుంది అని నమ్ముతున్నాను. 'గద్దలకొండ గణేష్' సినిమా ముందు నుంచే యూఎస్‌లో బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్‌గా కనిపించకూడదని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాతే సినిమా మొదలు పెట్టాను' అని కథానాయకుడు వరుణ్‌తేజ్ అన్నారు.