Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజరు ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రూపొందిన చిత్రం 'నల్లమల'. రవి చరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్స్‌లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా చిత్ర బందం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ నిర్వహించారు. దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ, 'ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా అద్భుతంగా ఉందని చెపుతున్నారు. ఆవు అమ్మ లాంటిది. దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా తీశాం. మంచి కంటెంట్‌కు మంచి ఆదరణ అంటే ఇదేనేమో అనిపించేలా ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు. సినిమా ఇంత బాగా రావడానికి మా నిర్మాత నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. నటీనటులు, నా టెక్నికల్ టీం అంతా చాలా కష్టపడ్డారు. నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని అన్నారు.
'మంచి కంటెంట్‌తో విడుదలైన మా చిత్రం చాలా బాగుందని చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా 'ఎమున్నావే.. పిల్లా' సాంగ్‌కు ప్రేక్షకులనుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.ఆ సాంగ్ కంటే కూడా ఈ సినిమా చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. విజువల్స్, మేకింగ్, టేకింగ్ అన్ని అద్భుతంగా వచ్చాయి. సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది' అని భానుశ్రీ చెప్పారు.