Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ 'అను'. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సందీప్ గోపిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు.
హోలీ సందర్భంగా ఈ చిత్రంలోని 'ఏమైంది ఏమో...' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో హీరో ప్రశాంత్ కార్తిక్ మాట్లాడుతూ, 'హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ బాగుంటాయి. కథ, కథనాలు మంచిగా ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు. మా సినిమా కూడా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన 'ఏమైంది..ఏమో' పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. అలాగే సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. దర్శకులు భీమినేని శ్రీనివాస్, దేవి ప్రసాద్ ఈ చిత్రంలో మంచి పాత్రల్లో నటించారు. సినిమా అవుట్‌ఫుట్ బాగా వచ్చింది. త్వరలో రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తాం' అని తెలిపారు.
ఆమని, భీమినేని శ్రీనివాస్, దేవి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ గోపిశెట్టి.