Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రొడక్షన్ నెం:10గా ఓ పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నూతన దర్శకుడు ఫణి కష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. తాజాగా మరో హీరోయిన్గా మిర్నా మీనన్‌ను సెలెక్ట్ చేశారు.
మలయాళం, తమిళ చిత్రాల్లో నటించిన మిర్నా ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. కథానుగుణంగా ఈ సినిమాలో హీరోయిన్లిద్దరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు: ఫణి కష్ణ సిరికి, సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్, డిఓపి: సతీష్ ముత్యాల, కళ: కొలికపోగు రమేష్, ఎడిటర్: సత్య గిడుతూరి, యాక్షన్: రామకష్ణ, కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్.