Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నే నితిన్ ( జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు) కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి 'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి, ఎం.ఎస్.రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా శుక్రవారం హీరో నార్నే నితిన్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. భిన్న హావభావాలతో ఉన్న నార్నే నితిన్ లుక్స్ అందర్నీ విశేషంగా అలరించడం ఆనందంగా ఉందని, హీరోగా మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు సతీష్ వేగేశ్న పేర్కొన్నారు.
అలాగే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేయనున్నారు.
నరేష్, రావు రమేష్, ప్రవీణ్, సుదర్శన్, భద్రం, అనంత ప్రభు, ప్రియా మాచిరాజు, నిహారిక సతీష్, మీనా కుమారి, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఓ.పి : ధాము నర్రావుల, సంగీతం : కైలాస్ మీనన్, ఎడిటర్ : మధు, ఆర్ట్స్ : రామాంజనేయులు, ఫైట్స్ : రియల్ సతీష్, లిరిక్స్ : శ్రీ మణి.