Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రపంచంలోని హిందూ పండిట్లకు, ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నట్లు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. 'మా సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న హిందూ పండిట్లకు, ప్రేక్షకులకు పాదాభి వందనాలు. ఈ సినిమా పరంగా ఏదైనా అభినందలు ఉంటే అది కశ్మీర్ పండితులకే చెల్లుతుంది. అందుకే వారికి ఈ సినిమా అంకితం ఇస్తున్నా. ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా ఉంటే ఛాలెంజ్‌గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకు ముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగా ప్రిపేర్ అయ్యాను. సినిమా అనేది కమర్షియల్. కానీ 5 లక్షల మంది కశ్మీర్ పండిట్ల బాధలు, సమస్యలను 32 ఏళ్ళనాటివి బయటకు తెచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా అంటూ, వీటిని చూస్తుంటే మాకే సిగ్గేస్తోందనే ఫీలింగ్‌ను వ్యక్తం చేశారు. ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్చ్ చేశాం. మూడు నెలలపాటు యు.ఎస్., కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. హిందీలో నాకు ఇది తొలి సినిమా. దీనికి సీక్వెల్ ఉండదు. త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన ఉంది. మా సినిమాకి అస్సాం, యు.పి., గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహా యింపు వచ్చింది. త్వరలోనే ఓటీటీలో కూడా విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం రవితేజతో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ' టైగర్ నాగేశ్వర రావు' చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితోనే 'ఢిల్లీ ఫైల్స్' అనే సినిమా ఆలోచనలో ఉంది' అని తెలిపారు.