Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వలిమై' చిత్రంతో ఇటీవల తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరో కొత్త సినిమాకి పచ్చ జెండా ఊపారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ నయా చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. శుక్రవారం ఈ ప్రాజెక్ట్ గురించి లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా తెలిపింది.
'అజిత్, విఘ్నేష్ శివన్ వంటి భిన్న కాంబోలో సినిమా చేయటం చాలా హ్యాపీగా ఉంది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం' అని లైకాప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ తెలిపారు.