Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. దిగ్విజయంగా ఈ సినిమా ఇటీవల 100వ రోజు షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం కేక్ కట్ చేసి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమాలోని తేజ సజ్జా లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'సక్సెస్‌ఫుల్‌గా 100 రోజుల పాటు షూటింగ్ చేయటానికి కారణం సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది సవాలుగా తీసుకుని కృషి చేయటమే. సూపర్ హీరో సినిమాల్లో అధిక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అదీకాక సూపర్ హీరో కొన్ని క్లిష్టమైన విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా వీటిని షూట్ చేయటం మరో సవాల్. కథానాయకుడు తేజ చాలా రోజుల పాటు వరుసగా 8 గంటల పాటు రోప్‌పై ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు. అమత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సీనియర్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ దీనికి సహకరిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సూపర్‌హిట్ కలయిక. అందుకే 'హను-మాన్' ప్రోమోలతో సంచలనం సృష్టించి, భారీ నాన్-థియేట్రికల్ వ్యాపారాన్ని చేసింది' అని చెప్పారు.