Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న యువ కథానాయకుడు సుశాంత్. స్టార్ల సినిమాల్లోనూ అతిథిగా మెరుస్తూ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్న సుశాంత్ తాజాగా డిజిటిల్ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. శుక్రవారం ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ వెబ్సిరీస్లోని ఆయన లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇందులో పవర్ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా ఆయన నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను జీ5తో కలిసి కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. 'ఇప్పటి వరకు ప్రేక్షకులు సుశాంత్‌ను పోలీస్ గెటప్‌లో చూడలేదు. పోలీస్ జీప్ ముందు మఫ్టీలో కూల్‌గా నిల్చొని చూస్తున్న సుశాంత్ పోస్టర్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. అలాగే మా వెబ్‌సిరీస్‌పై అంచనాలనూ పెంచింది. 'వరుడు కావలెను' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకురాలు లక్ష్మీసౌజన్య ఈ వెబ్‌సిరీస్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు' అని జీ5 ప్రతినిధులు తెలిపారు.