Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం 'ఉడుంబు'. దీని తెలుగు రీమేక్ రైట్స్‌ను నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి 'ర్యాంబో' అనే టైటిల్ పెట్టారు. ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంతో రత్నాకరం అనిల్ రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
హోలీ పండగ నేపథ్యంలో 'ర్యాంబో' ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈనెల 28 నుంచి సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సాంగ్స్: రామజోగయ్య శాస్త్రి, డైలాగ్స్: రైటర్ మోహన్, డాన్స్: శేఖర్ మాస్టర్, ఫైట్స్: స్టంట్ జాషువా, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రత్నాకరం అనిల్ రాజు.