Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న నూతన చిత్రం 'సమ్మతమే'. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మొదటి సింగిల్ లిరికల్ వీడియో కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన రొమాంటిక్ మెలోడీ 'బుల్లెట్ లా..' లిరికల్ వీడియోకి మంచి స్పందన లభించింది. శేఖర్ చంద్ర సమకూర్చిన స్వరాలతోపాటు కిరణ్, చాందిని ఈ పాటలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. ప్రవీణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.