Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ని మేకర్స్ మరింత విస్తృతం చేశారు. ఇందులో భాగంగా ముంబయి, ఢిల్లీ, కర్నాటక, దుబారు, చెన్నైల్లో ఇప్పటికే వినూత్న రీతిలో ప్రమోషన్ నిర్వహించారు. లేటెస్ట్గా గుజరాత్‌లోని 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' సర్దార్ వల్లభారు పటేల్ విగ్రహం దగ్గర సందడి చేశారు. అక్కడే మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి, సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్, ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' థీమ్‌తో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.