Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. విశేష ప్రేక్షకాదరణతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా కాసుల వర్షాన్ని కురిపించింది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శనివారం పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లు అర్జున్ను ఘనంగా సన్మానించి, ఇంతటి ఘన విజయం ఒక్క అల్లుఅర్జున్కే సాధ్యమని అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి, అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి, భానుప్రకాష్ ఐఏఎస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ తదితరులు హాజరయ్యారు. అల్లుఅర్జున్ను అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో సత్కరించారు.