Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో నాని తాజాగా నటిస్తున్న చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా సినిమా ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది.
ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు 'స్పార్క్ ఆఫ్ దసరా' పేరుతో గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. 'పక్కా మాస్ గెటప్‌తో నిప్పుల్లో ఉన్న రాయిని తీసుకుంటూ ఫెరోషియస్‌గా ఉన్న నాని లుక్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. దీంతో నాని భిన్నమైన లుక్, గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'స్పార్క్ ఆఫ్ దసరా' వీడియోలో నాని బీడీ వెలిగించి సింగరేణి మైన్స్ ద్వారా తన గ్యాంగ్‌తో కలిసి నడుస్తూ స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. నాని తన ఎగ్రెసివ్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీనికి సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ తోడవటంతో నాని పాత్ర పై మరిన్ని అంచనాలు పెరిగాయి. గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జరిగే కథ ఇది. నాని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. కంప్లీట్ యాక్షన్ డ్రామాతో ఉన్న గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.