Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. 'పెన్నీ..' అంటూ సాగే ఈ చిత్రంలోని రెండవ పాటను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాటలో మహేష్ బాబు, ఆయన తనయ సితార ఘట్టమనేని ఇద్దరూ నటించటం ఓ విశేషమైతే, ఈ పాటతో సితార సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం కావడం మరో విశేషం. ఈ ఇద్దరూ వేసిన అద్భుతమైన స్టెప్పులతో ఉన్న ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ పాటకి సంబంధించి విడుదల చేసిన ప్రోమోకి విశేష స్పందన లభించింది. ఆదివారం పూర్తి పాటను రిలీజ్ చేశాం. దీనికి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాటలో సితార ఒక రాక్‌స్టార్‌లా తన డ్యాన్స్ నైపుణ్యాలతో ఆకట్టుకుంది. దానితో పాటు తన హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్‌బాబు చాలా అందంగా కనిపించారు. అంతేకాకుండా తన స్టైల్‌తో మెస్మరైజ్ చేసాడు. తమన్ అందించిన స్వరాలు అందర్నీ ఫిదా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమా నిర్మాణాంతర పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మహేష్‌బాబు అభిమానులకు, ప్రేక్షకులకు సూపర్ స్పెషల్ ట్రీట్‌ను అందించడానికి మే 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.
వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, సంగీత దర్శకుడు: తమన్ ఎస్ఎస్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్.