Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజరు ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా నటించిన చిత్రం 'నల్లమల'.
రవి చరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైన విశేష ఆదరణ దక్కించుకుంటోంది.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో గో సంరక్షణ విశిష్టతను తెలియజేసేలా సినిమాను రూపొందించిన దర్శకుడు రవి చరణ్‌ను యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ శాలువాతో సన్మానించారు. యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ కె. శివకుమార్ మాట్లాడుతూ, 'గోవులను సంరక్షించుకోవాలనే సందేశాన్ని సినిమా అనే అతిపెద్ద మాద్యమం ద్వారా ప్రజలకు వివరించిన దర్శకుడు రవి చరణ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రస్తుత కాలంలో గోరక్షణ జరగడం లేదు. ధర్మ రక్షణ జరగాలంటే గోరక్షణ జరగాల్సిందే అనే నినాదంతో ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆవు అంతరించిపోతే మానవాళి క్లిష్ట పరిస్థితులు ఎదర్కోవాలి. మా యుగతులసి ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులతో కలిసి గోవును మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాని మీద ఉద్యమం కూడా చేస్తున్నాం. ఈ సినిమా ఆ ఉద్యమానికి మరింత బలం చేకూర్చుకుంది. ఇలాంటి సందేశాత్మక సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు.
'మంచి సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. రెండున్నరేళ్ల మా కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని అనుకుంటున్నాం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే నన్ను నమ్మి, ఇంత పెద్ద బాధ్యత నా మీద ఉంచిన మా నిర్మాతకి థ్యాంక్స్. మా నిర్మాతకు మంచి రెవెన్యూ రావడం హ్యాపీగా ఉంది' అని హీరో అమిత్ తివారి చెప్పారు.
మంచి కంటెంట్‌కు మంచి ఆదరణ ఉంటుందని ఈ సినిమా సక్సెస్‌తో పేక్షకులు మరోమారు నిరూపించారు. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గారు సినిమా చూసి ప్రశంసించడం ఒక అవార్డుగా భావిస్తున్నాను. సినిమా ఇంత బాగా రావడానికి మా నిర్మాత నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. అలాగే మాకు సపోర్ట్ చేసిన త్రివిక్రమ్, దేవకట్టా , రాఘవేంద్రరావు, దిల్‌రాజు గారికి నా హదయపూర్వక కతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకులకి సినిమా బాగా నచ్చింది. నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హీరోగా అమిత్ తన పాత్రకు ప్రాణం పోశాడు. అతను తప్ప ఆ పాత్రకు ఎవరూ న్యాయం చేయలేరని నా సన్నిహితులు చెబుతుంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సక్సెస్‌తో మరిన్ని మంచి సినిమాలను రూపొందిస్తాను.
- దర్శకుడు రవిచరణ్