Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్ మీడియా వేదికగా విశేష ప్రజాభిమానం పొందిన ప్రతిభ గల వ్యక్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో 'ఇన్ఫ్లూయెన్సర్ అవార్డ్స్ 2022' పేరిట అవార్డ్స్ ఫంక్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
'విప్రైడ్' సమర్పణలో సందీప్ గౌతమ్ సారధ్యంలో శ్రీని ఇన్ఫ్రా, యు మీడియా సహకారంతో జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 'ఎక్కడో పల్లెల్లో వీడియోలు చేసుకునే వారికి సైతం తగిన గుర్తింపు రావాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేయటం అభినందనీయం. సోషల్ మీడియా ప్రజలకు బాగా దగ్గరైంది. దీని ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. అటువంటి వారికి మరింత గుర్తింపు, ఎకంరేజ్మెంట్ ఇస్తూ ఇటువంటి అవార్డు ఫంక్షన్ చేయడం చాలా అవసరం కూడా. సినిమా ఇండిస్టీలో భాగంగా సోషల్ మీడియాలో సొంత ప్రతిభతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారికి ఈ అవార్డ్స్ ప్రదానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.
సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, హీరోయిన్లు హేబా పటేల్, పూర్ణ, బిగ్ బాస్ సన్నీ, హైపర్ ఆది, హరి ప్రియ, నిర్మాతలు అంబికా కష్ణ, దామోదర్ ప్రసాద్, ఎంఎల్సీ తక్కల పల్కి రవీందర్ రావ్, శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఇటువంటి ప్రోత్సాహాక అవార్డు వేడుకలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.