Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఓ స్ట్రయిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సోమవారం ప్రకటించాయి. ఆమె ఇప్పటికే రెండు ఉక్రెయిన్ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా పాపులర్ ఇండియన్ వెెబ్సిరీస్ 'స్పెషల్ ఆప్సో'్లలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆమె లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది.
'ఇది శివకార్తికేయన్‌కు 20వ చిత్రం. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆద్యంతం వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సుురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు, సురేష్‌బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.