Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ ముంబయి షెడ్యూల్లో ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కూడా జాయిన్ అయ్యారు. సోమవారంతో ఈ షెడ్యూల్ పూర్తయ్యింది. షెడ్యూల్ ముగింపు సందర్భంగా చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ను చిత్ర నిర్మాతలు ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
'పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవితోపాటు సల్మాన్‌ఖాన్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ సూపర్‌స్టార్.. ఈ ఇద్దరూ ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఇటువంటి రేర్ కాంబినేషన్‌ని చూడగానే అటు ప్రేక్షకులు, ఇటు ఇద్దరి స్టార్ల అభిమానులు మాత్రం థ్రిల్ ఫీలవ్వడం ఖాయం. అలాగే వీరికి దీటుగా నయనతార సైతం ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్ వివరాలను ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వాకాడ అప్పారావు.