Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'పెళ్ళిసందడి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ తనయుడు రోషన్ తాజాగా మరో కొత్త సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లు ప్రొడక్షన్ నెం.9గా రోషన్‌తో ఈ సినిమా చేయబోతున్నాయి.
దీనికి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. 'పెళ్ళి సందడి' మాదిరిగానే ఈసినిమా సైతం రోషన్‌కు మంచి విజయాన్ని అందిస్తుందని, అలాగే రోషన్ కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని మేకర్స్ దీమా వ్యక్తం చేశారు.