Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు రాహుల్ విజరు, మేఘా ఆకాష్ జంటగా, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నూతన చిత్రం ప్రారంభమైంది. మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాను మేకర్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథ అందించగా, అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ, 'డియర్ మేఘ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పనిచేశాను. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఇది మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కాబట్టి నాకు చాలా చాలా స్పెషల్‌గా భావిస్తున్నా' అని అన్నారు
'మా కొత్త చిత్రాన్ని ప్రారంభించాం. మంచి కాన్సెప్ట్ మూవీ ఇది. కూల్ రోమ్ కామ్‌గా ఆకట్టుకుంటుంది. ప్యాషనేట్ టీమ్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మీ (ప్రేక్షకుల) బ్లెస్సింగ్స్ కావాలి' అని హీరో రాహుల్ విజరు చెప్పారు.
మరో నటుడు అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా ఇది' అని తెలిపారు.
నిర్మాత సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, 'రాహుల్ విజరు, మేఘా ఆకాష్ టాలెంటెడ్ పెయిర్. వీళ్ల బెస్ట్ యాక్టింగ్ చూస్తారు. అలాగే రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా. హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేస్తాం. మొత్తం 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది' అని చెప్పారు.
దర్శకుడు అభిమన్యు బద్ది మాట్లాడుతూ, 'గోవా బ్యాక్ డ్రాప్లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇంట్రెస్టింగ్గా ఉండేలా తెరకెక్కించ బోతున్నాం. హీరో, హీరోయిన్లతో పాటు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా బాగా వస్తుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.
'మా కోట ఫిలిం ఫ్యాక్టరీ సంస్థలో ప్రొడక్షన్ వన్‌గా ఈ చిత్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. మంచి టీమ్‌తో, మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్‌తో అన్నింటికిమించి అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని మరో నిర్మాత అభిషేక్ కోట చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ, అర్ట్ డైరెక్టర్ : కే వి రమణ, నిర్మాతలు : ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట. సమర్పణ: బిందు ఆకాష్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం : అభిమన్యు బద్ది.
నేనొక సినిమాని సమర్పిస్తున్నానంటే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమా కథ నాకెంతో బాగా నచ్చింది. మా అమ్మాయి మేఘా ఆకాష్ నాయికగా ఈ చిత్రాన్ని నా సమర్పణలో నిర్మిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే నిర్మాతలతో మా అమ్మాయి 'డియర్ మేఘ' సినిమాలో నటించింది. విశేష ప్రేక్షకాదరణతో ఆ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ నిర్మాతలకు సినిమా అంటే ఎంతో ప్యాషన్. అందుకే వీరి కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నాను.
- మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్