Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి 'కళావతి..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాలతోపాటు విజువల్ ట్రీట్ ఇచ్చిన ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి, ఇప్పటికీ శ్రోతల హదయాలను దోచుకుంటూనే ఉంది.
ఈ బ్లాక్ బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్‌లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. మహేష్‌బాబు కెరీర్లోనే హిస్టరీని క్రియేట్ చేసిన ఫాస్టెస్ట్ సింగిల్‌గా ఈ పాట నిలిచినందుకు మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
'తమన్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రాతో చక్కటి ఫీల్‌ను కలిగించేలా బాణీలు సమకూర్చారు. సిద్ శ్రీరామ్ తన మధురమైన గానంతో పాటకు ప్రాణం పోశారు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం సమకూర్చారు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే హావభావాలతో అందరినీ సర్ప్రైజ్ చేస్తే, కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. అందుకే ఈ పాట మేం ఊహించిన దానికంటే రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇక లేటెస్ట్గా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'పెన్నీ' కూడా అనేక రికార్డులను బద్ధలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. మహేష్ తనయ సితార ఘట్టమనేని నటించిన ఈ పాట ఇప్పటికే వైరల్‌గా మారింది. ఈ పాటకు సైతం తమన్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. 'కళావతి..', 'పెన్నీ'..ఈ రెండు పాటలు హిట్టవ్వడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నఈ చిత్రాన్ని మే 12న వేసవి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.