Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్ వర్క్స్ పతాకాలపై యూనీక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ బుధవారం వెల్లడించారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం రిలీజ్ చేసిన రవితేజ నయా లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రని పోషించారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ, సంగీత దర్శకుడు: సామ్ సిఎస్, డిఓపి : సత్యన్ సూర్యన్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.