Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్. 'కథలు (మీవి-మావి)' అనే వెబ్ సిరీస్‌తో ఆయన త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ సిరీస్ నుండి మొదటి కథ 'పడవ' మోషన్ పోస్టర్ విడుదలైంది. అగ్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి దర్శకుడు వేగేశ్న సతీష్‌కి, అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరో సమీర్ వేగేశ్న, ఈషా రెబ్బ జంటగా నటించిన 'పడవ' ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు కథలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మిగతా కథల షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన 'కథలు' (మీవి-మావి) కచ్చితంగా అలరిస్తాయనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు.
త్వరలోనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వెబ్‌సిరీస్‌కి సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా : దాము, పాటలు : శ్రీమణి, ఎడిటింగ్ : మధు, ఆర్ట్ : రామాంజనేయులు, నిర్మాతలు : వేగేశ్న సతీష్ , దుష్యంత్, రచన - దర్శకత్వం : వేగేశ్న సతీష్.