Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సూపర్ హీరో చిత్రం 'అధీర'. ఈ చిత్ర పోస్టర్లను 'ఆర్.ఆర్.ఆర్' త్రయం ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేసి, 'అధీర' టీంకి బెస్ట్ విషెస్ తెలియజేసారు.
''అధీర' నుంచి వచ్చిన ఫస్ట్ స్ట్రైక్ ప్రారంభంలోనే భారీ స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అలాగే చిన్నప్పటి నుంచీ అధీరకు పవర్స్ ఉన్నాయనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తూ ఫస్ట్ స్ట్రైక్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్ లెవెల్లో ఉంది. వీటిని చూస్తే దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో ఎనర్జీ లెవెల్ పెంచేలా అధీరగా కళ్యాణ్ దాసరి కనిపించాడు. తన చేతిలో ఉన్న ఆయుధం వెన్నెముక ఆకారంలో ఉండి, ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధంను పోలి ఉంది. 'అధీర ఫస్ట్ స్ట్రైక్' అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయి. 'అధీర ఫస్ట్ స్ట్రైక్' ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచింది.
ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సూపర్ హీరో చిత్రం 'అధీర'. ఈ చిత్ర పోస్టర్లను 'ఆర్.ఆర్.ఆర్' త్రయం ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేసి, 'అధీర' టీంకి బెస్ట్ విషెస్ తెలియజేసారు. దీంతోపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్లో 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య తనయుడు కళ్యాణ్ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతుండటం కూడా సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ 'హను-మాన్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాని పనులను పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ చిత్రానికి డిఓపి : దాశరధి శివేంద్ర, సంగీతం: గౌరిహరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల.