Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్జున్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన 'జెంటిల్ మన్' తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎడ్యుకేషన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంది అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అంతేకాదు ఆ రోజుల్లోనే ఈ చిత్రాన్ని నిర్మాత కె.టి.కుంజుమన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జెంటిల్మన్ 2' సినిమాని నిర్మించేందుకు నిర్మాత కుంజుమన్ రంగం సిద్ధం చేస్తున్నారు.
మలయాళంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ నయనతార చక్రవర్తి హీరోయిన్గా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతోంది. బాలకష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఎన్టీఆర్' బయోపిక్‌లో అతిథి పాత్ర పోషించిన తర్వాత నయనతార చక్రవర్తి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా నటించనుంది. ఎవరనేది త్వరలో వెల్లడికానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.టి.కుంజుమన్ సోషల్ మీడియా వేదికగా 'ప్రధాన నటిగా నయనతార చక్రవర్తిని పరిచయం చేస్తున్నాం. మరో కథానాయికను త్వరలో వెల్లడిస్తాం' అని తెలిపారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.