Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యభరితమైన వినోద కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకుల అలరిస్తున్న జీ తెలుగు రాబోయే ఆదివారం సరికొత్త సందడి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య కథానాయకులుగా, రమ్యకృష్ణ, కృతిశెట్టి నాయికలుగా నటించిన చిత్రం 'బంగార్రాజు'. వెండితెర ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి ఈ ఏడాది తొలి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. 'సోగ్గాడే చిన్నినాయనా'కి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా నాగార్జున, నాగచైతన్య కెరీర్లో ఓ బిగ్గెస్ట్ హిట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రాబోయే ఆదివారం (ఈనెల 27) సాయంత్రం 5.30లకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం కానుంది. దీని కోసం జీ తెలుగు 'భీమవరంలో బంగార్రాజులతో బుల్లెట్ ర్యాలీ' పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్లో 700 మంది బైకర్స్ బంగార్రాజు మాదిరిగానే కాస్ట్యూమ్స్ వేసుకుని ర్యాలీలో పాల్గొని, బుల్లితెర చరిత్రలోనే సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. ఈనెల 20వ తేదీన జరిగిన ఈ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
'సోగ్గాడే చిన్ని నాయనా..' సినిమా కథ ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచి 'బంగార్రాజు' కథ స్టార్ట్ అవుతుంది. చిన్న బంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత (నాగార్జున) మాదిరే ఊర్లో అమ్మాయిల వెంట పడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు నాగలక్ష్మి (కతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తుంది సత్తెమ్మ (రమ్యకృష్ణ). తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మాటల్లో కంటే బుల్లితెరపై చూస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుందని అంటోంది జీ తెలుగు ప్రతినిధి బృందం.