Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తార శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సూర్య, రీతూ శ్రీ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'అమితాబ్ బచ్చన్'. జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో జె. చిన్నారి నిర్మిస్తున్నారు. అక్కల శ్రీనివాస్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త సుదర్శన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల శివకుమార్, మణి తదితరులు పాల్గొన్న ఈ వేడుకలో చిత్ర ఫస్ట్ లుక్‌ని సతీష్ రెడ్డి, ట్రైలర్‌ని సుదర్శన్ రెడ్డి రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు జె. మోహన్ కాంత్ మాట్లాడుతూ, 'అమితాబచ్చన్.. ఈ పేరొక సంచలనం. ఈ పేరొక ప్రభంజనం. అయితే ఇది ఆయన బయోపిక్ మాత్రం కాదు. ఓ మంచి ప్రేమకథ. ఫ్యామిలీ అంతా ఎంజారు చేసేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వస్తోంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. మంచి కథతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం. ఇటీవల ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్లో విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం' అని తెలిపారు.
చిల్లర వేణు, ఉన్ని కష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి లిరిక్స్: రామ్‌కుమార్ ఏఎస్‌కె, ఫైట్స్: స్టార్ మల్లీ-జీవన్ కుమార్, సంగీతం: ఆశ్రీత్ అయ్యంగార్, సినిమాటోగ్రఫీ: కిరణ్ దాసరి, ఎడిటర్: మహేంద్రనాథ్.బి, సహనిర్మాత: ఆకుల శ్రీనివాస్ రాజు, నిర్మాత: జె. చిన్నారి, కథ-దర్శకత్వం: జమ్మల మడుగు మోహన్ కాంత్.