Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ లేటెస్ట్గా నటిస్తున్న పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఎం.ఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిసా, కతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్ మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈనెల 26న ఫస్ట్ ఛార్జ్ పేరుతో నితిన్ ఫస్ట్ లుక్‌కి సంబంధించిన అప్డేట్ని మేకర్స్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఎంతో వినూత్నంగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుదల చేసి, అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. 'ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది - శ్రీ ఎన్.సిద్ధార్థరెడ్డి, ఏఐఎస్ (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు' అంటూ ప్రభుత్వ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌గా గుంటూరులో కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను సూచించేదిగా ఈ ఆర్డర్ కాపీ ఎర్రటి మరకలతో నిండి ఉంది. రాజకీయ నేపథ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్లో కనిపించనున్నాడు. ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ని, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేశారు. ఈ చిత్రంలో భారీ తారాగణంతోపాటు అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు. 'భీష్మ', 'మాస్ట్రో' తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌తో కలిసి పనిచేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి, నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్ ప్రొడ్యూసర్: జి.హరి, సంభాషణలు: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.