Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వల్ల గత రెండేండ్లుగా వాయిదా పడిన ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎట్టకేలకు ప్రారంభం కాబోతున్నాయి. సమ్మర్ సీజన్ టార్గెట్గా ఆరంభమయ్యే ఈ మ్యాచ్లకు వరల్డ్ వైడ్గా విపరీతమైన క్రేజ్ ఉంది. నేటి (మార్చి 26) నుంచి మే 29 వరకు ఐపిఎల్ కొనసాగనుంది. స్కూళ్లు, కాలేజీలకు హాలీడేస్ కావడంతో యూత్ ఎక్కువగా వీటిని చూసే ఛాన్స్ ఉంది. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై కొంత చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ (ఓవర్ ది టాప్) ఊపందుకున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని రకాల జోనర్ సినిమాలను ఇంట్లోనే కూర్చుని హాయిగా చూసుకునే వెసులుబాటు, సినిమా టికెట్ల భారీ పెరుగుదల, థియేటర్లలో విడుదలైన అగ్ర హీరోల సినిమాలు సైతం రెండు వారాల వ్యవధిలోనే ఓటీటీల్లో రావడం.. వంటి కారణాలతో థియేటర్లలో చూసిన అనుభూతి లేకపోయినప్పటికీ ఓటీటీలకే ప్రేక్షకులు ఎక్కువగా ఓటేస్తున్నారు. దీంతో రాబోయే సినిమాల కలెక్షన్లపై ఓటీటీ ప్రభావం కూడా కొంత ఉంటుంది.