Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై మహానగరంలో తెలుగువారి ఘన కీర్తిని చాటుతూ 1998లో ఏర్పాటైన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సినీ రంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించిన వారికి సైతం అవార్డ్స్ను బహుకరిస్తూ అందరి మన్ననలను అందుకుంటోంది. 24 ఏండ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని, వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీకు అడుగులు వేస్తోంది.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుపని కారణంగా 2020, 2021లో విడుదలైన చలన చిత్రాల్లోని 20 విభాగాలకు సంబంధించిన వారికి, అలాగే ఇతర రంగాల్లో రాణించిన విశిష్ట అతిథులకు ఉగాది పురస్కారాల ప్రదానాన్ని ఏప్రిల్ 3న చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఘనంగా నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్, సభ్యులు వెంకటేశ్వరరావు, దేవినేని సౌజన్యలు శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ వడ్ల పట్ల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ' మా అసోసియేషన్ 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో శ్రీ శుభకతు నామ సంవత్సర ఉగాది పండుగ రోజున మహిళా రత్న, బాపు బొమ్మ, బాపు రమణ పురస్కారాలను, సినీ రంగ ప్రముఖులను ఉగాది పురస్కారాలతో, వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళామణులను వెండి కిరీటం ధారణతో మహిళా రత్న పురస్కారంతో సత్కరించబోతున్నాం' అని తెలిపారు. 'నా సినిమా 'కలవరమాయే మదిలో' సినిమాకు ఉత్తమ నంది అవార్డు వచ్చింది. అలాగే ఈ అసోసియేషన్ కూడా ఉత్తమ చిత్రం అవార్డుతో మమ్మల్ని సత్కరించింది. ప్రతిభను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 24 ఏండ్లుగా విశేష కృషి చేస్తున్న బేతిరెడ్డి శ్రీనివాస్, ఆయన టీమ్ అభినందనీయులు' అని మోహన్ వడ్లపట్ల అన్నారు.