Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ విలక్షణమైన కథాంశంతో రూపొందుతున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో నటిస్తున్నారు. ఆర్.డి. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో నితిన్ తన 31వ చిత్రంగా నటిస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. శనివారం ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా..' అంటూ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. శత్రువులపై పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్న నితిన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పులిచారలున్న బాడీతో మారణాయుధాలతో కొందరు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాతరలో జరుగుతున్న యాక్షన్ సీన్‌గా ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నారు.
ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.