Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో మెగా 154 (వర్కింగ్ టైటిల్)తో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌ని హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారు.
ఈ షెడ్యూల్లో ఫైటర్స్‌తో చిరంజీవి చేసే ఉత్కంఠ భరితమైన యాక్షన్ ఎపిసోడ్‌ని ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ లక్ష్మణ్ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఇది మెగాస్టార్ అభిమానులకి, మాస్ ఆడియన్స్‌కి ఒక కిక్ ఇచ్చేలా ఉండబోతుంది. హీరోయిన్ శతి హాసన్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.
మెగా 154 చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపు దిద్దుకుంటుంది ఇందులో కమర్షియల్ అంశాలు సమపాళ్లలో ఉంటూ వింటేజ్ చిరంజీవిని మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకు వచ్చే రీతిలో దర్శకుడు బాబీ ఈ సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో ఫాన్స్‌కి పూనకాలు తెప్పించిన బాబీ ఈ చిత్రంలో తన ఫుల్ పొటెన్షియల్‌తో మెగాస్టార్ చిరంజీవిని ఒక సరికొత్త మాస్ పాత్రలో చూపించనున్నారు.చిరంజీవి - బాబీ - శతి హాసన్ కలయికలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి.కె. మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బందం పని చేస్తోంది. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్, డిఓపి : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, అదనపు రచన: హరి మోహన కష్ణ, వినీత్ పొట్లూరి, కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల.