Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేటెస్ట్గా 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా సినిమాతో యువ కథానాయకుడు రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ హిట్‌ను ఆయన తన బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులతోపాటు అభిమానులు, ప్రేక్షకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
'ఎస్ఎస్ రాజమౌళిగారి 'ఆర్ఆర్ఆర్' సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అపూర్వమైన పుట్టినరోజు కానుకని ఎంతో బాధ్యతతో స్వీకరిస్తాను' అని రామ్‌చరణ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. అలాగే తనయుడికి తొలిసారి సామాజిక మాద్యమం ద్వారా చిరంజీవి బర్త్‌డే విషెస్ చెప్పటం విశేషం. 'రామ్‌చరణ్‌కు సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పటం నాకు వింతగా అనిపిస్తోంది. కొడుకుగా చరణ్ నేను గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం' అని చిరు ట్వీట్లో పేర్కొన్నారు.
చిరంజీవి, కొరటాలశివ కాంబినేషన్లో రామ్‌చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. దీంతోపాటు తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా, యువి క్రియేషన్స్ పతాకంపై గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.