Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'.
ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్గా వీళ్లిద్దరి కాంబోలోనే గ్రాండ్ స్కేల్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బందం సోమవారం ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది. మారణాయుధాలు ఉన్న ఈ పోస్టర్లో '14:20 గంటలు- 19.0760 డిగ్రీలు, నార్త్, 72.8777 డిగ్రీలు ఈస్ట్ - నెక్స్ట్ మిషన్ లాంచ్ 29-03-2022' అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను నేడు (మంగళవారం) మేకర్స్ ప్రకటించనున్నారు.