Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ నటించనున్న నూతన చిత్ర ప్రారంభోత్సవం సోమవారం ఆత్మీయుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.
నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. వరుణ్‌తేజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌తేజ్ తల్లి పద్మజ కెమెరా స్విచ్చాన్ చేయగా, వరుణ్‌తేజ్ తండ్రి నాగబాబు క్లాప్‌కొట్టారు. వీళ్ళిద్దరూ సంయుక్తంగా చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. 12వ చిత్రంగా వరుణ్‌తేజ్ నటిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.
ఇదిలా ఉంటే, వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటించిన చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.