Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కృష్ణ వ్రింద విహారి' టీజర్ అద్భుతంగా ఉంది. నాగశౌర్య నటించిన 'ఛలో' కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి' అని అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. నాగశౌర్య, షెర్లి సెటియా జంటగా అనిష్ ఆర్.కష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉష మూల్పూరి నిర్మించిన చిత్రం 'కష్ణ వ్రింద విహారి'. ఏప్రిల్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన వేడుకకి దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా విచ్చేసి, టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిష్ ఆర్. కష్ణ మాట్లాడుతూ, 'ఇదొక కూల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్'. అందర్నీ అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు. 'మా బ్యానర్లో మరో మంచి సినిమా చేశామని గర్వంగా చెప్పగలం' అని నిర్మాత ఉష మూల్పూరి చెప్పారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ, 'గ్యారెంటీగా చాలా పెద్ద హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేశాం' అని తెలిపారు.